: రాజధానిలో టెర్రర్ అలర్ట్
దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులకు తెరదీయనున్నారా? అంటే, అవుననే సమాధానమిస్తున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. ఈ మేరకు తమకు పక్కా సమాచారముందని తెలిపాయి. ఈ క్రమంలో సంబంధిత శాఖలను అప్రమత్తం చేశాయి. దీంతో, హస్తినలో భద్రత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు.