: సీఎం నిజాలు మాట్లాడారు: వీరశివారెడ్డి
తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సబబేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడడం శుభపరిణామమని అన్నారు. విభజన వల్ల భవిష్యత్తులో ఎదురయే సవాళ్లను పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తెరగాలని సీఎం సూచించారని వీరశివారెడ్డి తెలిపారు.