: మోడీ సభకు పెద్ద సంఖ్యలో యువత హాజరు కావాలి: బీజేపీ


ఈ నెల 11న హైదరాబాదులో జరగనున్న నరేంద్ర మోడీ సభకు భారీ ఎత్తున హాజరవ్వాలంటూ యువతకు పిలుపునిస్తోంది భారతీయ జనతా పార్టీ. 'నవభారత యువభేరి' సభ ద్వారా యువత మనోభావాలు చాటుతామని బీజేపీ నేతలు చెప్పారు. హైదరాబాదులో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్దొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, కేంద్రంపై పలు విమర్శలు చేశారు. నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికలు భారత జవాన్లను పొట్టనబెట్టుకుంటే, సరైన స్సందన కరవైందన్నారు. దేశ రక్షణ మంత్రి ఆంటోనీ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో ఆంటోనీ వ్యాఖ్యలు వింటుంటే ఆయన పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందని పేర్కొన్నారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యానిస్తున్న ఆంటోనీ పదవి నుంచి తప్పుకోవాలని వెంకయ్య డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News