: ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరం: డీఎస్
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రజలను, మంత్రులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని అన్నారు. సీఎం ప్రజలకు ఆందోళన కలిగేలా మాట్లాడారని డీఎస్ తెలిపారు.