: మక్కా మసీదులో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు
రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాదులోని మక్కామసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. ఈద్ ముబారక్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే శుక్రవారంనాడే రంజాన్ రావడంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సామూహిక ప్రార్థనలతో చార్మినార్ పరిసర ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. గతంలో జరిగిన దృష్టాంతాల నేపథ్యంలో మక్కా మసీదు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.