: గాంధీ భవన్లో తెలంగాణ నేతల భేటీ
తెలంగాణ ప్రకటన అనంతరం టీ-కాంగ్రెస్ నేతలు మరోసారి సమావేశాలకు తెరదీశారు. మంత్రి జానారెడ్డి, పాల్వాయి గోవర్థనరెడ్డి, సుదర్శన్ రెడ్డి, దానం నాగేందర్ తదితరులు గాంధీ భవన్లో ఈ ఉదయం సమావేశమయ్యారు. సీఎం కిరణ్ మీడియా సమావేశం రేపిన సెగలే ఈ భేటీకి కారణమని తెలుస్తోంది. సీఎం వ్యాఖ్యల పట్ల చర్చించేందుకే వీరు సమావేశమైనట్టు తెలుస్తోంది.