: లాహోర్ కాన్సులేట్ నుంచి అమెరికా సిబ్బంది వెనక్కి


అల్ ఖైదా హెచ్చరికలతో పాకిస్థాన్ లోని లాహోర్ పట్టణంలో ఉన్న కాన్సులేట్ నుంచి అమెరికా తన అత్యవసర సిబ్బంది మినహా మిగతావారిని ఉపసంహరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా కాన్సులేట్ లు, రాయబార కార్యాలయాలపై దాడులు చేస్తామంటూ కొన్ని రోజుల క్రితం ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా హెచ్చరికలు జారీ చేయడంతో ముందస్తు జాగ్రత్తగా అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, పాకిస్థాన్ కు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు మానుకోవాలని తమదేశ పౌరులకు అమెరికా సూచించింది.

  • Loading...

More Telugu News