: రాజమండ్రిలో అగ్ని ప్రమాదం.. కోటి ఆస్తి బుగ్గి
రాజమండ్రి పట్టణంలో గతరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒక ఫొటో ఫ్రేము దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.