: జాతీయ రహదారిపై స్నానాలతో నిరసన
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఎన్ఎంయూ కార్మికులు విశాఖలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మద్దెల పాలెం వద్ద జాతీయ రహదారిపై కార్మికులు స్నానాలు చేయడంతో వాహనాల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. మరోవైపు విభజనకు వ్యతిరేకంగా ఎన్ఎంయూ చేపట్టిన రిలే దీక్షలు ఐదోరోజుకు చేరుకున్నాయి. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమం కొనసాగుతుందని యూనియన్ కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు.