: అంతరిక్షంలో మరో సూర్యుడున్నాడు!


అంతరిక్షంలో సూర్యుడిలాంటి మరో నక్షత్రాన్ని పరిశోధకులు కనుగొన్నారు. మన నక్షత్రమండలంలో సూర్యుడిచుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే అంతరిక్షంలో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు. ఇది మన సూర్యుడిలాగే ఉందని చెబుతున్నారు.

హవాయిలోని సుబారు టెలిస్కోపు ద్వారా అతినీలలోహిత సమాచారాన్ని ఉపయోగించి అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం అంతరిక్షంలో సూర్యుడిలాంటి ఒక నక్షత్రాన్ని కనుగొంది. ఈ నక్షత్రం చుట్టూ కూడా తక్కువ ద్రవ్యరాశి గల గ్రహాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు. ఎక్కువ కాంతిమంతమైన నక్షత్రం జిజె504 చుట్టూ రాకాసి గ్రహవలయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అనేకసార్లు బృహస్పతి గ్రహం వంటి ద్రవ్యరాశి కలిగిన, అదే పరిమాణాన్ని కలిగిన కొత్త ప్రపంచం జిజె504బి వంటి తక్కువ ద్రవ్యరాశి కలిగిన గ్రహం సూర్యుని వంటి నక్షత్రం చుట్టూ కనిపిస్తుంటుంది. దీన్ని శాస్త్రవేత్తలు నేరుగా సాంకేతిక ప్రక్రియల ద్వారా కనుగొన్నారు.

ఈ గ్రహంమీదికి మనం ప్రయాణిస్తే ఇంకా మండుతున్న విశ్వాన్ని మనం చూడవచ్చని మైకేల్‌ మెక్‌ ఎల్‌వెయిన్‌ చెబుతున్నారు. ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా ద్వారా ఆ గ్రహం రంగును చూడగలిగామని, ఇదివరకూ ఊహించే ఇతర గ్రహాలకన్నా కూడా అది చాలా నీలంగా కనిపించిందని దీన్నిబట్టి దాని వాతావరణంలో కొద్దిగా మబ్బులతో కమ్ముకుని ఉన్నట్టు తెలుస్తోందని మైకేల్‌ తెలిపారు. జిజె504బి కక్ష్యలు బృహస్పతి కక్ష్యలకన్నా కూడా సూర్యునికి తొమ్మిదింతల దూరంలో ఉన్నాయని, ఏవిధంగా భారీ గ్రహాలు ఏర్పడతాయో తెలుసుకోవడానికి సిద్ధాంతరీత్యా ఇవి సవాలుగా ఉన్నాయని మైకేల్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News