: స్నోడెన్ ను గాంధీతో పోల్చిన అమెరికా రాజకీయవేత్త


అమెరికా నిఘా వర్గాల రహస్యాలను ప్రపంచానికి బహిర్గతం చేసిన ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ ను అమెరికా రాజకీయవేత్త ఒకరు మహాత్మాగాంధీతో పోల్చారు. స్నోడెన్ శాసనోల్లంఘనకు పాల్పడినా, అహింసాయుత వైఖరికి కట్టుబడ్డాడని జాన్ లూయిస్ అనే డెమొక్రాటిక్ పార్టీ నేత వ్యాఖ్యానించారు. ఏదైనా విషయాన్ని మనం వ్యతిరేకిస్తున్నా, ఇది అన్యాయమని చెబుతున్నా, బహిరంగంగా ఎలుగెత్తి చాటుతున్నా, లోపభూయిష్ట చట్టాలపై పోరాడుతున్నా మనకు అంతరాత్మ అనేది ఉన్నట్టే అని ఆయన విపులీకరించారు. స్నోడెన్ కు అంతరాత్మ ఉండబట్టే ఈ విధమైన పోరాటానికి తెరదీశాడని కొనియాడారు.

  • Loading...

More Telugu News