: ఆర్టీసీ ఈడీకి సమ్మెనోటీసిచ్చిన ఎన్ఎంయూ
ఆర్టీసీ ఈడీకి విజయవాడ జోన్ ఎన్ఎంయూ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు నిరసనగా ఈ నెల 12 అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలిపారు. కేంద్రం విభజన నిర్ణయం సమీక్షించుకునే వరకు తాము సమ్మెలో కొనసాగాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు.