: జూన్ 3న ఎడ్ సెట్... నోటిఫికేషన్ విడుదల


బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. వరుసగా రెండవసారి ఈ పరీక్షను నిర్వహిస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. జూన్ 3న ఎడ్ సెట్ పరీక్ష నిర్వహించి 21న ఫలితాలు విడుదల చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ జయప్రకాశ్ రావు హైదరాబాదులో తెలిపారు.

అన్ని ప్రవేశ పరీక్షలకు ఈ ఏడాది ఆన్ లైన్ లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. మార్చి 14 నుంచి దరఖాస్తులను విక్రయించనుండగా, దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 30 చివరి తేదీగా అధికారులు నిర్ణయించారు.  

  • Loading...

More Telugu News