: కేసీఆర్ హత్యకు కుట్ర జరుగుతోంది: గవర్నర్ కు టీఆర్ఎస్ ఫిర్యాదు


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను హత్య చేసేందుకు జరుగుతున్న కుట్రపై విచారణ జరిపించాలంటూ టీఆర్ఎస్ నేతలు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. ఈ మేరకు గవర్నర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. హత్య చేస్తామంటూ వస్తున్న బెదిరింపు కాల్స్ పై విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరినట్లు ఈటెల రాజేందర్ తెలిపారు. ఫోన్ కాల్స్ చేస్తున్న వారిని శిక్షించాలని, కేసీఆర్ కు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. బెదిరింపు ఫోన్ కాల్స్ పై డీజీపీ దినేష్ రెడ్డిని కూడా కలుస్తామన్నారు.

  • Loading...

More Telugu News