: పొలార్డ్ లో ధోనీ కనిపిస్తున్నాడు: హేన్స్
టీ20 స్టార్ కీరన్ పొలార్డ్ పై విండీస్ దిగ్గజ క్రికెటర్ డెస్మండ్ హేన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. మైదానంలో పొలార్డ్ శైలి చూస్తుంటే, టీమిండియా కెప్టెన్ ధోనీని చూసినట్టే ఉందని హేన్స్ అభిప్రాయపడ్డాడు. ఒత్తిడి సమయాల్లో నిశ్చింతగా ఉండడం, ఆట పట్ల ఆకళింపు చేసుకోవడం వంటి అంశాల్లో ధోనీతో పొలార్డ్ ను పోల్చవచ్చని ఈ మాజీ ఓపెనర్ చెప్పాడు. బ్రిడ్జిటౌన్లో మీడియాతో మాట్లాడుతూ, హేన్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, పొలార్డ్ ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. హేన్స్ ఈ జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఇంతకుముందూ పొలార్డ్ ఆటను చూశానని, అతడిలో ఆట పట్ల అపార పరిజ్ఞానం ఉందన్న విషయం అప్పుడే అర్ధమైందని చెప్పాడు.