: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రెడ్ అలెర్ట్
ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈనెల 21 వరకు ఎయిర్ పోర్టులో సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించిన సీఐఎస్ఎఫ్ అధికారులు సందర్శకులకు జారీ చేసే 100 రూపాయల ఎంట్రీ టికెట్లు నిలిపివేశారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘావర్గాల హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎయిర్ పోర్టులో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.