: ప్రజల ముందుకు రానున్న సీఎం
రాష్ట్ర విభజన అనంతరం దాదాపుగా అజ్ఞాతంలో ఉన్నట్టుగానే వ్యవహరించిన సీఎం కిరణ్ కుమార్ ఇక ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయం వద్ద సాయంత్రం ఏడింటికి మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. కిరణ్ గత 9 రోజులుగా సెక్రటేరియట్ ను సందర్శించలేదు. ఈ నేపథ్యంలో, ఆయన ప్రజలనుద్ధేశించి మాట్లాడనున్నారు.