: వరదలతో వ్యాప్తి చెందుతున్న విష జ్వరాలు
తూర్పుగోదావరి జిల్లాలో వరదల నేపథ్యంలో విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. పదిరోజుల్లో విషజ్వరాల కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు. అయినా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడికుదురు మండలం కరవాక గ్రామంలో 70 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్టు సమాచారం. వీరందరూ చుట్టుపక్కల ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.