: 'సీమాంధ్ర' ధాటికి రెండు గంటలకు వాయిదాపడ్డ ఉభయసభలు
సీమాంధ్ర ఎంపీల ధాటికి పార్లమెంటులో ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. దీంతో, వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా తరువాత 12.30 గంటలకు సమావేశమైన రాజ్యసభలో రక్షణ మంత్రి ఆంటోనీ పూంఛ్ సెక్టార్ లో కాల్పుల ఘటనపై ప్రకటన చేశారు. 'వీ వాంట్' జస్టిస్ నినాదాలతో దద్దరిల్లిన సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. అటు, లోక్ సభ కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.