: ఆంటోనీ ప్రకటన సవరణ


లోక్ సభలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మరోసారి ప్రకటన చేశారు. తనకు అందిన సమాచారం మేరకే సభలో మొదటి ప్రకటన చేశానని తెలిపారు. పూంఛ్ సెక్టార్ లో జరిగిన దాడి ప్రాంతాన్ని ఆర్మీ చీఫ్ పరిశీలించారని ఆయన తెలిపారు. పాక్ సాయంలేనిదే నియంత్రణ రేఖ వెంబడి ఇలాంటి ఘటనలు జరగవని స్పష్టం చేశారు. జవాన్లపై దాడి ఘటనలో పాకిస్థాన్ కు చెందిన బలగాలు కూడా పాల్గొన్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News