: 'వైట్ హౌస్' కు ఒబామా అద్దె కట్టాల్సి వస్తే..


అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ సువిశాల విస్తీర్ణంలో నిర్మితమైన సంగతి తెలిసిందే. ఇంతటి భారీ భవంతికి ఒకవేళ అధ్యక్షుడు బరాక్ ఒబామా అద్దె కట్టాల్సి వస్తే.. అంటూ 'న్యూయార్క్ డెయిలీ' ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. సుమారు 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరిన వైట్ హౌస్ లో 132 గదులున్నాయి. అందుకుగాను అద్దె రూపేణా నెలకు రూ.110 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆ పత్రిక లెక్కలేసింది. అయితే, పాపం ఒబమా వార్షికాదాయం రూ.24 కోట్లేనట. ఈ లెక్కన అద్దె కడుతూ పోతే ఒబామా దివాలాదీయడం ఖాయమని కథనం చదివిన వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, వైట్ హౌస్ భవనానికి పన్ను రూపేణా ట్రెజరీకి ఏడాదికి రూ.66 లక్షలు చెల్లిస్తున్నారట.

  • Loading...

More Telugu News