: పోలీసులకు ప్రాంతాలు, రాజకీయాలతో సంబంధం ఉండదు: డీజీపీ


రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై డీజీపీ దినేశ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, పోలీసులకు ప్రాంతాలు, రాజకీయాలతో సంబంధం ఉండదని, ఎవ్వరినైనా ఒకే దృష్టితో చూస్తారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాది, ముద్దాయి.. ఈ రెండే తెలుసని వివరించారు. సీమాంధ్రులా, తెలంగాణ వారా? అన్నది చూడరని స్పష్టం చేశారు. ఈనెల 12 నుంచి ఆర్టీసీ సమ్మె జరగనున్న నేపథ్యంలో ఆయన రైల్ రోకోలపై దృష్టి పెట్టారు.

సీమాంధ్రలో రైల్ రోకోలపై పునరాలోచన చేయాలని సూచించారు. రైల్ రోకోలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. రైల్ రోకోలు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని, ఆందోళనకారులు అలాంటి కార్యక్రమాలు విరమించుకోవాలని హితవు పలికారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా నిరసనలు తెలుపుకుంటే అభ్యంతరం లేదని డీజీపీ అన్నారు. ఇక హైదరాబాదులో ర్యాలీలపై నిషేధం ఉందన్నారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఆందోళనలు చేపట్టవద్దని సూచించారు.

  • Loading...

More Telugu News