: 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా
అధికార పార్టీ సభ్యుల తీరుకు మండిపడుతూ బీజేపీ సభ్యులు వాకౌట్ చేయడంతో రాజ్యసభ 12 గంటల వరకు వాయిదాపడింది. రాష్ట్ర విభజనపై అధికార పార్టీ తీరును నిరసిస్తూ సభలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మండిపడ్డారు. విభజనపై ఆయన మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. దాంతో, సభలో గందరగోళం నెలకొంది. ఛైర్మన్ హమీద్ అన్సారీ ఎంత వారించినా వినకుండా అధికార పార్టీ సభ్యులు పెద్దగా అరుస్తూ గందరగోళం సృష్టించారు. దాంతో, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ వేశారు.