: డాన్సులతో అబ్బురపరిచిన మిచెల్లీ ఒబామా


ఆమె అమెరికా ప్రథమ పౌరురాలు. అయినా ఆమెలో ఎంతో జోష్. ఎప్పడూ ఫిట్ గా ఉంటుంది. నవ యువతీ యువకులతో దీటుగా ఆడిపాడుతుంది. ఫ్యాషన్ విషయంలో ఎప్పటికప్పుడు తన అభిరుచులు మారుతూ ఉంటాయి. తన హుషారైన డాన్సులతో అందరినీ ఆకర్షించే ఆమె ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామానే.

శుక్రవారం రాత్రి వాషింగ్టన్లో జిమ్మీ ఫాలన్ నిర్వహించిన ఎన్ బీసీ కామెడీ షోలో ఆమె పాల్గొన్నారు. అందులో ఉత్సాహంగా నర్తించి ప్రేక్షకులను, వీక్షకులను కట్టిపడేశారు. చేతులు తిప్పుతూ  వయ్యారంగా స్టెప్పులు వేశారు. కార్యక్రమం చూస్తున్న వారు ఆమె డాన్సుకు ఆశ్చర్యపోయారు. దేహధారుడ్యం ప్రాధాన్యతపై మిచెల్లీ ఈ విధంగా ప్రచారాన్ని చేశారు. 

  • Loading...

More Telugu News