: రంజాన్ సందర్భంగా సీమాంధ్ర బంద్ కు మినహాయింపు
ముస్లిం సోదరుల రంజాన్ పండుగ సందర్భంగా నేటి మధ్యాహ్నం నుంచి రేపు సాయంత్రం వరకు సీమాంధ్రలో బంద్ కు మినహాయింపు ఇస్తున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ తెలిపింది. అయితే ఆందోళనలు, నిరసనలు కొనసాగుతాయని జేఏసీ సభ్యులు తెలిపారు. నేటితో సీమాంధ్ర బంద్ తొమ్మిదవ రోజుకు చేరింది.