: అణువణువునూ స్కాన్‌ చేస్తుందట


స్కానర్‌ను సాధారణంగా ఏదైనా ఒక వస్తువును స్కాన్‌ చేసి దానికి సంబంధించిన పదార్ధాలను గుర్తించడం, అలాగే అనుమానాస్పద వ్యక్తులు ఏదైనా ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళుతున్నారా? వంటి విషయాలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇలా పెద్దగా కంటికి కనిపించే వస్తువులనే కాకుండా అత్యంత చిన్న వస్తువులను కూడా స్కాన్‌ చేసి చూపించే సరికొత్త స్కానర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ స్కానర్‌ అణువంత వస్తువునైనా కూడా స్కాన్‌ చేసి మనకు చూపించేస్తుందని చెబుతున్నారు.

పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక తాజా స్కానర్‌ను అభివృద్ధి చేశారు. ఈ స్కానర్‌ అణువంత రూపంలో ఉండే వస్తువునైనా కూడా స్కాన్‌ చేసి చూపించేస్తుందని చెబుతున్నారు. ఈ సరికొత్త స్కానర్‌ టెరాహెర్ట్‌జ్‌ రేడియేషన్‌తో పనిచేస్తుంది. ప్రతి వస్తువునూ అణువణువునూ కూడా శోధిస్తుందని ఈ స్కానర్‌ పరిశోధకుల్లో ఒకరైన జెరెమీ లేవీ చెబుతున్నారు. ఈ సరికొత్త స్కానర్‌ అణుమాత్రంగా ఉండే పదార్ధాలను కూడా గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

టెరాహెర్ట్‌జ్‌ స్కానర్లను ఇప్పటికే విమానాశ్రయాల్లో కూడా వినియోగిస్తున్నారని, అయితే అవి అత్యంత సూక్ష్మమైన పదార్ధాలను గుర్తించలేవని, తాము రూపొందించిన ఈ సరికొత్త స్కానర్‌ మాత్రం చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలో పదికోట్ల వంతు ఆకారాన్ని కూడా తనిఖీ చేసి చూపిస్తుందని జెరెమీ లేవీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News