: ఇండో-నేపాల్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్ వరుస పేలుళ్ల నేపథ్యంలో సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్-నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు. భద్రతను పటిష్ట పరచడంతో పాటు సరైన దృవీకరణ పత్రాలు ఉంటేనే దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకే ఈ చర్యలని సశస్త్ర సీమాబల్ కమాండెంట్ కెఎస్ బంకోటి చెప్పారు.