: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకోవాలి: బొత్స
ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీలోని కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ విజ్ఞప్తి చేశారు. సమ్మెవల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సమ్మె ఆలోచన విరమించుకోవాలని బొత్స యూనియన్ నేతలను కోరారు.