: ఆర్టీసీ నిరవధిక సమ్మె సైరన్ మోగింది
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడలో ఈడీకి సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్టు ఈయూ నోటీసులిచ్చింది. 12వ తేదీ అర్థరాత్రి తరువాత విజయవాడ రీజియన్ లోని 124 డిపోల్లో బస్సులన్నీ నిలిపేస్తామని ఆర్టీసీ ఈయూ ప్రకటించింది. దీంతో ఉద్యమం మరింత తీవ్రరూపు దాల్చనుంది. మరోవైపు, రెవెన్యూ ఉద్యోగులు కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్టు అధికారులకు నోటీసులు అందజేశారు.