: సైనా, సింధు ముందంజ
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, యువ ఆశాకిరణం పీవీ సింధు శుభారంభం చేశారు. చైనాలోని గ్వాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో నేడు తొలి రౌండ్ మ్యాచ్ లు జరిగాయి. సైనా, సింధులను తొలి రౌండ్లో బై లభించింది. దీంతో నేరుగా రెండో రౌండ్ కు అర్హత సాధించిన సైనా 21-5, 21-4తో రష్యా షట్లర్ ఓల్గా గొలోవనోవాను వరుస గేముల్లో చిత్తు చేసింది. తదుపరి రౌండ్లో సైనా.. థాయ్ క్రీడాకారిణి పోర్నిటిప్ తో తలపడనుంది. ఇక తెలుగమ్మాయి పీవీ సింధు 21-19, 19-21, 21-17తో జపాన్ అమ్మాయి కావోరి ఇమాబెపుపై నెగ్గింది.