: సంగీత దర్శకుడు చక్రికి ఊరట
వేధింపుల కేసులో ఆరోపణలెదుర్కొంటున్న టాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ చక్రికి ఊరట లభించింది. చక్రి, నిర్మాత పరుచూరి ప్రసాద్ తనపై అత్యాచారానికి యత్నించారని రెండ్రోజుల క్రితం ఫిర్యాదు చేసిన మహిళ తన కేసును వాపసు తీసుకుంది. ఆ సమయంలో తాను బాగా మద్యం తాగి ఉన్నానని, ఏం చెప్పానో సరిగా తెలియడంలేదని, అందుకే ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్టు పోలీసులకు తెలిపిందట. ఫ్రెండ్ షిప్ డే నాడు బంజారాహిల్స్ లో జరిగిన వేడుకల్లో ఆ యువతి స్నేహితుడు.. చక్రి, ప్రసాద్ లు మద్యం సేవిస్తుండగా వారిని తన కెమెరాలో బంధించేందుకు యత్నించాడు. దీనికి చక్రి, ప్రసాద్ అడ్డుచెప్పడంతో వివాదం చెలరేగిందని, ఈ నేపథ్యంలోనే సదరు యువతి ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది.