: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భూప్రకంపనలు
ప్రకాశం, నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు ప్రజలను వణికించాయి. ప్రకాశం జిల్లా లింగ సముద్రంలో, పామూరు మండలం పాగోలువారిపల్లి, రేణిమడుగు, బోడవాడ, అయ్యవారిపాల్లి, అయ్యన్నకోట గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది.
నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం కలిగిరి మండలం చీమలవారి పాలెంలోనూ భూ ప్రకంపనలు రావడంతో ప్రభుత్వ పాఠశాలలోని భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. దాంతో, విద్యార్ధులు భయంతో బయటకు పరుగులు తీశారు. అటు దుత్తలూరు మండలం, వింజమూరు మండలాల్లోనూ కొద్దిపాటి భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.