: లోక్ సభలో ఆహార భద్రత బిల్లు.. రేపటికి సభ వాయిదా
కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం విప్ జారీ చేసింది. బిల్లుపై సభలో వచ్చేవారం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ఎంపీలు నినాదాలు చేశారు. ఆ వెంటనే సభ రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరా కుమార్ తెలిపారు.