: హైదరాబాదు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా మాకు సమ్మతమే: కిషన్ రెడ్డి


హైదరాబాదును పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు తమకేమీ అభ్యంతరం లేదని బీజేపీ చెబుతోంది. ఆ నిర్ణయం తమకు సమ్మతమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు తెలంగాణకు తలూపి ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం దురదృష్టమన్నారు. సైద్ధాంతిక పరంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ ఎప్పుడూ ఒప్పుకుంటుందన్నారు. తమ పార్టీ ఎప్పటికీ ఒకే మాటపై నిలబడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News