: వాట్స్ యాప్ లో వాయిస్ మెసేజ్ సౌలభ్యం
ఇప్పటి వరకూ చాటింగ్ అప్లికేషన్ గానే ఉన్న వాట్స్ యాప్ లో ఇకపై వాయిస్ మెసేజ్ లు కూడా పంపుకోవచ్చు. విచాట్ అప్లికేషన్ నుంచి పోటీని తట్టుకునేందుకు వీలుగా.. వాట్స్ యాప్ కూడా వాయిస్ మెసేజ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఫోన్ కాల్ వలే పనిచేయదని, బటన్ ఆన్ చేసి వాయిస్ రికార్డ్ చేసి పంపుకోవాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే, నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 30 కోట్లను దాటిందని ప్రకటించింది.