: భారత సైనికుల ప్రతీకారం!


సరిహద్దుల్లో ఐదుగురు జవాన్లను పాక్ దళాలు బలిదీసుకోవడంపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది! తాజాగా ఇరు దేశాల దళాల మధ్య చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు హతమైనట్టు తెలుస్తోంది. పాక్ రేంజర్లు తాము జరిపిన కాల్పుల్లో కచ్చితంగా గాయపడ్డారని, వారు మరణించి ఉంటారని తాము భావిస్తున్నామని భారత ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద తొలుత పాక్ దళాలే కాల్పులు ఆరంభించాయని, తాము దీటుగా తిప్పికొట్టామని ఆ అధికారి చెప్పారు. తాజా ఘటనతో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు మరింత జటిలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News