: పాకిస్థాన్ ను నమ్మడమా.. పెద్ద జోక్: గౌతం గంభీర్
సరిహద్దుల్లో ఐదుగురు భారత జవాన్లను పాక్ సైనికులు కాల్చి చంపడం పట్ల క్రికెటర్ గౌతం గంభీర్ ఘాటుగానే స్పందించాడు. పాకిస్థాన్ ను నమ్మడం ఒక జోక్ గా అభివర్ణించాడు. 'సరిహద్దుల్లో పాకిస్థాన్ ఈ ఏడాది 57 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని న్యూస్ పేపర్లలో చూశాను. అయినా మనం వారిని(పాక్) నమ్మాలి! ఇట్సే జోక్' అంటూ గౌతం గంభీర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.