: సమైక్య ఉద్యమంలో 1,024 కేసులు నమోదు
ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో 1,024 కేసులు నమోదైనట్లు అదనపు డీజీపీ కౌముది తెలిపారు. ఇంతవరకు 221 మందిని అరెస్టు చేశామన్నారు. మరో వెయ్యిమందిని ముందస్తుగా అరెస్టు చేశామని చెప్పారు. ఇక, పలు జిల్లాల్లో జాతీయ నాయకుల విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలో 39 కేసులు నమోదయ్యాయని, వీటికి సంబంధించి 94 మందిని అరెస్టు చేశామని వివరించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.