: ఉత్తరాఖండ్ కు 2,400 కోట్ల సాయం


వరదలతో భారీగా నష్టపోయిన ఉత్తరాఖండ్ పునరుద్ధరణ కార్యక్రమాలకు 40 కోట్ల డాలర్ల (రూ.2,400కోట్లు) సాయాన్ని ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు అంగీకరించాయి. ఇళ్లు, వ్యవసాయం, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాల కల్పనతోపాటు, పాడైపోయిన రోడ్ల నిర్మాణం, పర్యాటకాభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశంలో రుణ సాయంపై అంగీకారం కుదిరింది. ఈ మొత్తంలో 10 శాతం ఉత్తరాఖండ్ ప్రభుత్వం, మిగతా 90 శాతం కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News