: బాధ్యతల స్వీకరణకు నో చెప్పిన జస్టిస్ మెహతా


గుజరాత్ లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ ఆర్ఏ మెహతా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. గుజరాత్ లో లోకాయుక్త సరిగా పని చేయట్లేదని గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. గుజరాత్ అల్లర్ల సందర్భంగా వార్తల్లో నిలిచిన గుజరాత్ లోకాయుక్త, మరోసారి జస్టిస్ మెహతా బాధ్యత స్వీకరణ నిరాకరణతో వార్తల్లోకెక్కింది. ఆయన నిరాకరణకు కారణాలు తెలియాల్సి ఉంది. గత కొంత కాలంగా మెహతా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తాను పదవి చేపడితే దానికి కళంకం తెచ్చినవాడనవుతానని, తాను మోడీపై పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసినందున తానిచ్చే తీర్పులపై విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉందని, అలాంటి సందర్భంలో నమ్మకం కలిగించలేని పని చేయడం సరికాదని గవర్నర్ కు ఇచ్చిన లేఖలో ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News