: పొలీసు నియామకాలకు బ్రేక్!


తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం వెలువడడంతో పోలీసు నియామకాలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. 11,623 కానిస్టేబుళ్లు, ఎస్ ఐల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సివిల్, ఆర్మ్ డ్, స్పెషల్ ప్రొటెక్షన్, జైళ్లు, అగ్నిమాపక శాఖలలో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్ర విభజనకు నిర్ణయం జరిగినందున ఆ ప్రక్రియ పూర్తయ్యాకే అప్పటి అవసరాలకు అనుగుణంగా భర్తీ చేపట్టాలని పోలీస్ శాఖ భావిస్తోంది. ఎస్ ఐ, కానిస్టేబుల్ పోస్టులకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం భర్తీ ఇంకా పూర్తి కాలేదు. ఇది మరో మూడు నెలలు పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజా నోటిఫికేషన్లు ఇక రానట్లేనని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News