: పక్షవాత బాధితులకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌


పక్షవాత బాధితులు కదలలేని, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటారు. తమ భావాలను వ్యక్తం చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉండే వారికోసం ఒక కొత్తరకం సాఫ్ట్‌వేర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ కదలలేని, పలుకు చెప్పలేని వారి కంటిపాప కదలికలను ఆధారంగా వారి మనసులోని భావాలను మనకు మాటల రూపంలో అందజేస్తుందని చెబుతున్నారు.

జర్మన్‌కు చెందిన పరిశోధకులు ఒక కొత్తరకం సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించారు. ఈ పరిజ్ఞానం పక్షవాతంసోకి కదలలేని, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండే రోగులు కేవలం తమ కంటిపాప కదలికలతో తమ మనసులోని భావాలను వ్యక్తీకరించేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పక్షవాత బాధితులు 'అవును, కాదు' తరహాలోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు మన కంటిపాప వివిధ పరిమాణాల్లో పెరుగుతూ, చిన్నదవుతూ ఉంటుంది. ఈ సహజ పరిమాణాన్ని విశ్లేషించడం ఆధారంగా ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక ల్యాప్‌ట్యాప్‌, కెమెరా ఉపయోగిస్తారు. ఇతరమైన ప్రత్యేక ఉపకరణాలుగానీ, రోగులకు శిక్షణనివ్వడంగానీ ఇక్కర్లేదని ఫిలిప్స్‌ యూనివర్సిటాట్‌ మార్బర్గ్‌కు చెందిన పరిశోధకులు వాల్ఫ్‌గాంగ్‌ ఐయన్‌ హోసర్‌ చెబుతున్నారు. ఈ పరిజ్ఞానం కేవలం పక్షవాత రోగులకేకాకుండా కోమాలో ఉన్నవారికి కూడా ఉపయోగపడగలదని ఆయన భరోసా వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News