: నడిచివెళితే మంచిదే


నడక చాలా మంచిదని అందరికీ తెలిసిందే. అలాగే సైకిల్‌ తొక్కడం కూడా. నడక, సైక్లింగ్‌ వల్ల షుగరు ముప్పు చాలా వరకూ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్యాలయాలకు నడిచి వెళ్లడం, లేదా సైకిల్‌పై వెళ్లడం వల్ల షుగరు వ్యాధి ముప్పును మరింతగా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంపీరియల్‌ కాలేజ్‌, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌కు చెందిన పరిశోధకులు తాము పనిచేసే ప్రదేశాలకు ప్రజలు చేరుకునే విధానాలకు, వారి ఆరోగ్య సమస్యలకు మధ్యగల సంబంధాన్ని పరిశీలించారు. వీరి పరిశీలనలో కార్యాలయాలకు ఇతర వాహనాలపై వెళ్లేవారికన్నా కూడా నడిచి వెళ్లేవారికి, లేదా సైకిలుపై వెళ్లే వారికి షుగరు వచ్చే ప్రమాదం 40 శాతం తగ్గుతుందని తేలింది. బ్రిటన్‌లో 20 వేలమందిపై వీరు సర్వే చేసి ఈ సర్వే ఫలితాలను విశ్లేషించారు. ప్రజలు తాము పనిచేస్తున్న కార్యాలయాలకు తమ సొంత వాహనాలపైన లేదా ట్యాక్సీల్లో వెళ్లేవారికంటే కూడా సైకిలుపై లేదా నడిచి వెళ్లడం, లేదా ప్రజా రవాణా మార్గాలను వినియోగించుకుని వెళ్లేవారికి అధిక బరువు ముప్పు తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. వాహనాలపై వెళ్లేవారి కంటే కూడా నడిచి వెళ్లేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా 17 శాతం తక్కువగా ఉన్నట్టు వీరి పరిశోధనలో తేలింది. అలాగే సైకిలుపై వెళ్లేవారికి కూడా షుగరు వచ్చే ముప్పు దాదాపుగా 50 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన గురించి ఇంపీరియల్‌ కాలేజికి చెందిన ఆంటోనీ లావెర్టీ మాట్లాడుతూ 'శారీరక శ్రమ ప్రాధాన్యతను ఈ అధ్యయనం స్పష్టం చేసిందని, రోజూ కార్యాలయాలకు నడిచి వెళ్లడం, లేదా సైకిలుపైనో లేదా ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి మంచిదని తేలిందని' చెబుతున్నారు.

  • Loading...

More Telugu News