: రేఖాగణితంతో నకిలీల గుట్టు రట్టు చేయవచ్చు


అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తించడం సాధ్యం కావడం లేదు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అసలు చిత్రాలు ఏవో నకిలీ చిత్రాలు ఏవో అనే విషయం గుర్తించడం అసాధ్యమైపోతున్న నేపధ్యంలో నకిలీలను రేఖాగణితం ఆధారంగా ఇట్టే గుర్తించే ఒక కొత్తరకం సాఫ్ట్‌వేర్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు.

డార్ట్‌మౌత్‌ కాలేజ్‌, బెర్క్‌లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో నకిలీ చిత్రాలను ఇట్టే గుర్తించేయొచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఫోటోల్లో అసలు చిత్రాలు ఏవి, నకిలీ చిత్రాలు ఏవి అనే విషయాన్ని గుర్తించేందుకు వెలుగు, నీడలు గమనించి గుర్తించేవారు. వెలుగు, నీడలు సరిగ్గా కనిపిస్తున్నాయా లేదా అనే విషయంపై దృష్టిపెట్టి నకిలీలను గుర్తించేవారు. అయితే ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌తో నకిలీ చిత్రాలను చక్కగా గుర్తించేయవచ్చట. ఈ సాఫ్ట్‌వేర్‌ ఫోటోల్లో ఉండే 'సమన్వయం లేని' నీడలను పసిగడుతుంది. ఈ నీడలు చిత్రంలో ఉన్న వెలుగుతో ఎంతవరకూ కలిసిపోతున్నాయో రేఖాగణితం ఆధారంగా విశ్లేషిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి 1969లో అమెరికా వ్యోమగాములు చంద్రునిపై పాదం మోపినప్పటి చిత్రాన్ని పరిశీలించి అది అసలైనదేనని తేల్చారు శాస్త్రవేత్తలు. చంద్రునిపై అమెరికా యాత్రికుల ఛాయాచిత్రం నకిలీదని ఇప్పటికీ వాదించేవాళ్లున్నారు. అందుకే ఈ చిత్రాన్ని తాము విశ్లేషణకు తీసుకున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News