: అలాంటి పరిస్థితుల్లోనే సృజనాత్మకత ఎక్కువ


మనలో కొద్దిమంది సృజనాత్మకంగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి సృజనాత్మకమైన ఆలోచనలు ఎలా వస్తాయి? అని చాలామందికి సందేహం కలుగుతుంటుంది. అయితే పలు అంశాలను సృజనాత్మకంగా ఆలోచించి చేయడం అనే విషయంలో హాయిగొలిపే ప్రాంతాలకంటే కూడా చిందరవందరగా ఉండే ప్రాంతాలే బాగుంటాయట. అలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇలాంటి సృజనాత్మక ఆలోచనలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కటి పరిశుభ్రమైన పరిసరాల్లో ఉండేవారికంటేకూడా చిందరవందరగా ఉండే పరిసరాల్లో ఉండేవారికే సృజనాత్మక ఆలోచనలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వ పరిశోధకురాలు కతాలీన్‌వోస్‌ బృందం కార్యాలయాల వాతావరణం, ఉద్యోగుల ఆలోచనా తీరుపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? అనే విషయంపై ఒక ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో హాయిగా, పరిశుభ్రమైన ప్రాంగణాల్లో పనిచేసేవారికంటేకూడా చిందరవందరగా, గజిబిజిగా ఉండే పరిసరాల్లో పనిచేసేవారిలోనే సృజనాత్మకమైన ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయని తేలింది. ఇందుకోసం వారు పలువురు ఉద్యోగులకు పరీక్షలు, వర్క్‌షాప్‌లు నిర్వహించారు. కార్పొరేట్‌ వాతావరణంలో పనిచేసే ఉద్యోగులకు ఉదారత ఎక్కువట. అయితే నష్టభయంతో మూసధోరణిలోనే వెళ్లడానికి ఇష్టపడతారని, తప్పితే కొత్తగా ఆలోచించడానికి, సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దగా చొరవ చూపరని తేలింది. అంతేకాదు, ఆరోగ్యం, ఆహారం పట్ల మాత్రం వీరికి శ్రద్ధ ఎక్కువగా ఉంటుందట. అదే సాధారణ కార్యాలయాల్లో పనిచేసేవారైతే నష్టభయం ఉన్నాకూడా బాధ్యతలు తీసుకుని పనులను పూర్తి చేయడానికి ఎక్కువ చొరవ చూపుతారని, పాత విధానాల్లో కొట్టుకుపోకుండా కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచనలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలకు నాంది పలుకుతారని ఈ అధ్యయనంలో తేలింది.

  • Loading...

More Telugu News