: కాంగ్రెస్ నాటకాలు ఆపాలి: అరుణ్ జైట్లీ
పార్లమెంటు ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆపాలని బీజేపీ ఎంపీ అరుణ్ జైట్లీ మండిపడ్డారు. రాజ్యసభలో పోడియంలోకి వెళ్లి మరీ నినాదాలు చేస్తున్నారని, ఒకరి తరువాత ఒకరుగా సైగలు చేసుకుని మరీ ఆందోళనకు దిగుతున్నారని దుయ్యబట్టారు. ముందు మీ పార్టీ నేతలను కట్టడి చేసి తరువాత ప్రకటనలు చేయండని కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు. ఎన్డీఏ హయాంలో రెండు రాష్ట్రాలను విభజించినా అక్కడ ప్రజల మధ్య సామరస్య పూర్వక వాతావరణంలో అందరి అనుమతితో విభజన చేశామని గుర్తుచేశారు. ముందు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో సభను నడిపించేందుకు కృషి చేయాలని జైట్లీ సూచించారు.