: సీమాంధ్ర సకలజనుల సమ్మెలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్
ఈ నెల 7న సీమాంధ్రలోని 123 డిపోల వద్ద ధర్నా చేపట్టనున్నట్టు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ప్రకటించింది. 8న రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని, ఈ నెల 10న డిపోల ఎదుట మానవహారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 13న ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చిన సకల జనుల సమ్మెలో పూర్తిస్థాయిలో పాల్గొంటామని ఈయూ ప్రకటించింది.