: పాక్ రాయబారికి భారత్ సమన్లు
జమ్మూకాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ వద్ద వాస్తవాధీన రేఖ దాటి ఐదుగురు భారత సైనికులను గతరాత్రి పాకిస్తాన్ సైనికులు మట్టుబెట్టడంపై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు పాక్ డిప్యూటీ హై కమిషనర్ కు సమన్లు జారీ చేసింది. తీవ్ర నిరసన తెలిపిన భారత్ ఇకముందు ఇలాంటి దాడులు జరగకుండా ఆపాలని హెచ్చరించింది. అర్థరాత్రి జరిగిన ఆ ఘటనకు బాధ్యులను గుర్తించాలని పేర్కొంది.