: ఈనెల 12 నుంచి ఏపీఎన్జీవోల నిరవధిక సమ్మె
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నిరవధిక సమ్మెకు ఏపీఎన్జీవోలు నిర్ణయించారు. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమ్మె చేసుకోవాలని సీఎస్ వారికి సూచించారు.