: రిజర్వ్ బ్యాంక్ నూతన గవర్నర్ గా రఘురాం రాజన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్ గా రఘురాం రాజన్ నియమితులయ్యారు. ఇంతవరకు చీఫ్ ఎకనామిక్ ఎడ్వైజర్ గా ఉన్న రఘురాం...దువ్వూరి సుబ్బారావు తర్వాత నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు ఆయన కొనసాగుతారు. గతంలో ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్)కి ముఖ్య ఆర్ధికవేత్తగా పని చేశారు. సెప్టెంబర్ లో దువ్వూరి పదవీకాలం ముగియనుంది.